నిబద్ధతతో పనిచేయాలి :  కలెక్టర్​రిజ్వాన్​బాషా షేక్

జనగామ, వెలుగు: జనగామ జిల్లాలోని జనగా మ, స్టేషన్​ ఘనపుర్, పాలకుర్తి నియోజకవర్గాల్లోని ఆర్డీవో, ఎస్డీవో, తహసీల్దార్లతో బుధవారం జనగామ కలెక్టర్​రిజ్వాన్​బాషా షేక్​ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర సర్కార్​ఈ నెల 26 నుంచి ప్రతిష్టాత్మంగా చేపట్టనున్న  రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త ఆహార భద్రత కార్డుల జారీ తదితర పథకాలపై అవగహన కలిగి ఉండాలని సూచించారు. లబ్ధిదారులపై జాబితాపై ఎలాంటి ఆపోహలు లేకుండా గ్రామసభల్లో చదివి వినిపించాలని ఆఫీసర్లకు సూచించారు.